స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అధికారికంగా ఏ విషయమూ బయటికి రాకపోవడంతో, అభిమానులు ఇంకా సందేహంగానే వున్నారు.అయితే కొన్ని రోజులుగా అల్లు అర్జున్ లారీ డ్రైవింగులో శిక్షణ తీసుకుంటున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. దాంతో ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించేది నిజమేనని తెలుస్తోంది. బీడీ తాగుతూ .. లుంగీ పైకి కట్టి .. పూర్తి మాస్ లుక్ తో చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఉంటాడట. రష్మిక కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.ఆలా వైకుంఠపురంలో
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa