బాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న నేహా ధూపియా తెలుగులోనూ పలు సినిమాల్లో మెరిసింది. వెండితెరపై అవకాశాలు తగ్గిన తర్వాత బుల్లితెరపై సత్తా చాటుతోంది. `నో ఫిల్టర్ విత్ నేహా` కార్యక్రమం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం `రోడీస్ రెవల్యూషన్` ప్రోగ్రామ్‌లో నేహ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో తాజాగా నేహా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఒక పోటీదారుడు తన గర్ల్ ఫ్రెండ్ చేసిన మోసం గురించి వెల్లడించాడు. తన గర్లఫ్రెండ్ తనతో పాటు మరో ఐదుగురు వ్యక్తులతో ఒకేసారి డేటింగ్ చేసిందన్నాడు. ఈ విషయం తెలిసి ఆమెను కొట్టానని చెప్పాడు. దాంతో నేహ అతనిపై బూతులతో విరుచుకుపడింది. `ఆమె ఎంత మందితో తిరిగితే నీకేంటి ? ఎంత మందితో డేటింగ్ చేస్తే నీకేంటి ? అది ఆమెకున్న స్వేచ్ఛ. ఆమె స్వేచ్ఛను ప్రశ్నించడానికి నీవెవరు` అంటూ కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అనరాని మాటలతో ఆమెపై విరుచుకుపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa