మా నగరం ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. డ్రగ్స్ మాఫియా, పోలీసుల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ్ , తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు హిందీ ప్రేక్షకులను కూడా కనెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తుంది. ఈ రీమేక్ చిత్రంలో స్టార్ హీరోనే ఉంచాలని భావించి అజయ్ దేవగన్ ను ఎంపిక చేసింది. 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. జూన్ ఫస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. మరి అజయ్ కి ఖైదీ ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa