సినిమాలో ఛాన్స్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు . ఒకసారి సినిమాలో ఛాన్స్ వస్తే అది ఏ పాత్ర అయినా చేయడానికి హీరోయిన్స్ వెనకాడరు. ఈ అమ్మడు కూడా కెరియర్ స్టార్టింగ్ లో అమ్మ పాత్రలు , అక్క పాత్రలు చేసింది . ఇప్పుడు హీరోయిన్ గా మంచి క్రేజ్ రావడంతో ఇక పై అలాంటి పాత్రలను చేయనంటుంది. తెలుగు భామ ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ కంటే తమిళం లోనే ఎక్కువ సినిమాలు చేసింది. తమిళ్ లో కన్న సినిమా తో అక్కడ ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఈ సినిమాను తెలుగులో కౌశల్య కృష్ణమూర్తి పేరుతో రీమేక్ చేశారు.ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఐశ్వర్య కు మంచి పేరు వచ్చింది దాంతో తెలుగులో కూడా ఈ అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయి. దాంతో ఇక పై అమ్మ , అక్క లాంటి క్యారెక్టర్స్ చేయకూడదని నిర్ణయించుకుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa