ఏదైనా విషయంపై క్లారిటీ రానంత వరకూ ఎన్ని వార్తలైన చక్కర్లు కొట్టేస్తాయి. అందులో నిజమెంత,అబద్ధమెంత అనేది తెలిసేలోగా చాలా వార్తలు,కథనాలు వైరల్ అయిపోతాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర గురించి రకరకాలా కథనాలు వస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతోంది.వాస్తవానికి ఈ కీలక పాత్రను ముందు రామ్‌చరణ్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ కారణంగా రామ్‌చరణ్ చేయలేడని,అందుచేత,బన్నీ కానీ మహేశ్ కానీ చేస్తే బాగుంటుందని వార్తలొచ్చాయి. చివరకు ఆ పాత్రను మహేష్ చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే 30రోజుల పాత్ర కోసం మహేశ్ రూ.30కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశాడని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.మరోపక్క ఈ పాత్ర తనకు వదిలేయాలని బన్నీ కూడా మహేష్ ని బతిమాలినట్లు మరో వార్త వచ్చింది. అయితే మహేష్ ని ముందు ఓకే అనుకున్నప్పటికీ అంత భారీ రెమ్యునరేషన్ కారణంగా బడ్జెట్ పరిమితులు దాటి పోతున్నందున చరణ్‌తోనే ఆ పాత్రను చేయించాలని మెగా వర్గం అభిప్రాయ పడుతున్నట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటనేది క్లారిటీ వస్తే తప్ప ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa