ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రణ్ బీర్’ తరహాలో ‘సుశాంత్ రాజ్ పుత్’

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2020, 07:09 PM

బాలీవుడ్  నటి   రియా చక్రవర్తితో  నటుడు సుశాంత్  సింగ్  రాజ్ పుత్  డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ సహా టాలీవుడ్  మీడియాలోనూ ప్రచారమవుతోంది. సుషాంత్.. ఇంతకుముందు సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీఖాన్ తో డేటింగ్ చేసాడు. ఆ జంట కేథార్ నాథ్ చిత్రంలో నటిస్తోన్న సమయంలో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం జాక్విలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి ప్రయివేట్ ఆల్బమ్స్ చేస్తున్నాడు. సుశాంత్ – జాకీ జంటతో తెరకెక్కించిన మకనా(డ్రైవ్) వీడియో సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సాంగ్ షూట్ సమయం లో జాకీతో.. సుశాంత్ మరీ క్లోజ్ అయిపోయాడట. రియా- సారా తరహాలోనే ఈ భామని కూడా యంగ్ హీరో  వెంటాడుతున్నాడని  బాలీవుడ్ మీడియాలో  తాజాగా కథనాలొస్తున్నాయి. ఇలా వరుస పెట్టి గాళ్స్ ని  వెంటాడటంతో సుషాంత్ పేరు బాలీవుడ్ లో మార్మోగుతోంది. చాక్లెట్ బోయ్ రణబీర్ తర్వాత సుశాంత్ కి మళ్లీ  ఆ  ఇమేజ్  దక్కడం  విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa