ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ప్లాప్ దర్శకుడికి అనుష్క హిట్ ఇస్తుందా ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2020, 08:11 PM

స్వీటీ అనుష్క చిత్ర పరిశ్రమలో 15 ఏళ్లు కంప్లీట్ చేసింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండస్ట్రీ పెద్దలు ఆమె మంచితనాన్ని, నటనాశక్తిని బహిరంగ వేదికగా ఆడియెన్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు స్వీటిలోని సేవాగుణాన్ని సైతం బయటపెట్టేశారు. దీంతే అనుష్క అంటే పాజిటీవ్ ఇంపాక్ట్ మరింత పెరిగిపోయింది. ‘భాగమతి’ తర్వాత ఈ సీనియర్ నటి హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నిటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరిట ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే తాజాగా ఓ ప్లాప్ డైరెక్టర్ కు అనుష్క తన నెక్ట్స్ చిత్రాన్ని ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ కిషన్, రెజినా జంటగా 2014లో ‘రా రా కృష్ణయ్య’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆ చిత్ర దర్శకుడు మహేష్‌కి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు.  దాదాపు ఆ మూవీ రిలీజైన ఆరేళ్ళ తరువాత ఆయనక అనుష్క శెట్టిని..అద్భుతమైన కథతో ఇంప్రెస్ చేశారనే టాక్ నడుస్తోంది. దీంతో స్వీటీ స్ట్రిప్ట్ ఫుల్‌గా సిద్దం చేస్కోని మూవీ రెడీ అయిపోమని చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa