నిన్నటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ బాస్ నాలుగవ సీజన్ హోస్ట్ గా చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ హోస్ట్ గా చేయడంపై మహేష్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదట. దీంతో సీజన్ 3 ని చక్కగా నడిపించిన నాగార్జున తోనే నాలుగవ సీజన్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తుందట స్టార్ మా.బిగ్ బాస్ టీమ్ నాలుగవ సీజన్ కోసం నాగార్జున ని సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి. అంతేకాక సీజన్ 3 తో పోలిస్తే, సీజన్ 4 కి డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామని నాగ్ కి ఆఫర్ ఇచ్చారట. మొత్తానికి బిగ్ బాస్ 4హోస్ట్ గా నాగ్ ఫిక్స్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa