‘మేజర్’ అనే భారీ చిత్రాన్ని చేస్తున్నాడు నటుడు అడవిశేషు. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇండియాలో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ కలయికలో `మేజర్` అనే భారీ చిత్రం రూపొందుతుంది. ద్విభాషా చిత్రంగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితమాధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు ఉన్ని కృష్ణన్ జయంతి కాగా, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేజర్ చిత్రం నుండి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇద్దామని ప్లాన్ చేశారు మేకర్స్. కాని కోవిడ్ 19 వల్ల దీనిని వాయిదా వేశాం. కాని మన సైనికుల త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోకండి . జై హింద్ అని అడివి శేష్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa