క్రిష్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మొఘలాయిల కాలంనాటి కోహీనూర్ డైమండ్ చుట్టూ తిరుగుతుంది అని.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోహినీర్ వజ్రాన్ని కొట్టేసే దొంగ పాత్రలో నటిస్తున్నాడంటూ... ఏవేవో కథలు ప్రచారంలోకొచ్చాయి. తాజాగా మరో సినిమా కూడా పవన్ - క్రిష్ స్టోరీ లైన్ మాదిరిగానే ఉన్నట్లు కనబడుతుంది. అది కూడా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్ 'డిటెక్టీవ్ 2' సినిమా. ఈ సినిమాలో కూడా వజ్రాన్ని కొట్టేసే దొంగ పాత్రలో విశాల్ నటించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. అలాంటాప్పుడు క్రిష్ మళ్ళీ తన కథలో మార్పులు ఏమైనా చేస్తాడో.. లేక అదే కథని తెరకెక్కిస్తాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa