ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో '' ఆర్ ఆర్ ఆర్ '' ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి.ఈ సినిమా విషయంలో అతను తప్పు చేస్తున్నాడని అంటుంది టాలీవుడ్. గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టిన హరీష్ శంకర్ తో వెంటనే రామయ్య వస్తావయ్య సినిమా చేసాడు తారక్. ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు రెండు వరుస హిట్ లు రాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఇలా హిట్ వచ్చిన దర్శకుల వెంట అతను పడుతున్నాడని, త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో ఫెయిల్ అయితే మాత్రం జూనియర్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు.త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ లుక్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. బాలీవుడ్ లో తనకు సన్నిహితంగా ఉండే దర్శకులతో కూడా అతను చర్చలు జరుపుతున్నాడు. త్వరలోనే ఈ లుక్ కి సంబంధించి ఒక అంచనాకు వచ్చి అప్పుడు విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ వేసే ఈ అడుగు అతనికి షాక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేది కొందరి మాట. ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది అంటున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa