కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు, మూవీ షూటింగ్ లు అన్నీ బంద్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ బన్నీ సినిమాకు కూడా తగిలింది. ప్రస్తుతం బన్నీ- సుక్కు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను కేరళలో చిత్రీకరించాలని ప్లాన్ చేసిందట చిత్రబృందం. కరోనా కారణంగా సినిమా చిత్రీకరణకు కేరళ ప్రభుత్వం నో చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు సుక్కు టీమ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa