ఇటీవల అక్కినేని సమంత ప్రధాన పాత్రలో 'ఓ బేబీ' సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు నందిని రెడ్డి. తాజాగా నందిని ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నరు. వైజయంతీ మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కథానాయకుడిగా నాగశౌర్యను తీసుకున్నారు. గతంలో నందినిరెడ్డిశౌర్య తో కలిసి కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాల్లో నటించాడు . ఇక ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa