తాజాగా సేఫ్ హ్యాండ్స్ అనే ఛాలెంజ్ నడుస్తుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టెడ్రోస్ అధనామ్ గెబ్రయెసుస్( డబ్ల్యూహెచ్‌వో జనరల్ డైరెక్టర్) సరికొత్త ఛాలెంజ్‌ని తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన వారు చేతులని శుభ్రంగా కడుక్కోవడంతో పాటు మరో ముగ్గురు లేదా నలుగురికి ఛాలెంజ్ విసరాలి. టెడ్రోస్ .. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణేకి సేవ్ హ్యాండ్స్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన అమ్మడు చేతులని సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. స్పోర్ట్స్ పర్సన్స్ విరాట్ కోహ్లీ, రోజర్ ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డోలని నామినేట్ చేసింది. తనని నామినేట్ చేసిన టెడ్రోస్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఈ ఛాలెంజ్ ప్రజల ఆరోగ్యంని తప్పక కాపాడుతుంది. దీనిని ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని పిలుపునిచ్చింది .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa