‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమా ‘సాహో’. ప్రభాస్ - శ్రద్ధా కపూర్ జంటగా ఈ మధ్య 'సాహో' సినిమా ప్రేక్షకులను పలకరించింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడలేదు. కథాకథనాల పరంగానే కాదు, సంగీతం పరంగా కూడా ఈ సినిమాకి చాలా తక్కువ మార్కులు దక్కాయి. ఈ సినిమాలో అనుష్క - ప్రభాస్ పై ఒక పాటను పెడితే బాగుంటుందనే ఆలోచన చేశారట.ఎందుకంటే 'బిల్లా' .. 'మిర్చి' .. 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలతో ఈ జంటకి ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం లభించింది. అందువలన ఈ జోడీపై ఒక సాంగ్ ను పెడితే అది సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావించారట. అందుకు అనుష్క కూడా అంగీకరించిందట. అయితే ఆ సాంగును చిత్రీకరించాలని అనుకున్నప్పుడు, 'నిశ్శబ్దం' సినిమాకి సంబంధించి తన డేట్స్ ను సర్దుబాటు చేయడం కుదరలేదట. అందువల్లనే ప్రభాస్ తో అనుష్క ప్రత్యేక గీతం కుదరలేదనే వార్త తాజాగా బయటికి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa