ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క పాత్రలో ‘భూమిపెడ్నేకర్’

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2020, 08:50 AM

హిందీలోకి  రీమేక్ కానుంది  తెలుగు  చిత్రం  భాగమతి. హిందీలో   ‘దుర్గావతి’ అనే  టైటిల్ ను  ఖరారు చేశారు. ఈ  సినిమాను  విక్రమ్ మల్హోత్ర నిర్మిస్తుండగా  స్టార్  నటుడు   అక్షయ్ కుమార్ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వున్నాడు. భాగమతిలో  అనుష్క ప్రధాన పాత్రని పోషించింది. హిందీలో భూమిపెడ్నేకర్  నటిస్తోంది.  ‘భాగమతి’కి  అనుష్క లుక్  .. ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనుష్క అసమానమైన నటనకి ఈ సినిమా అద్దం పట్టింది. కథ తన పాత్ర చుట్టూనే తిరగడం వల్ల  .. నటనకి అవకాశం ఉండటం వలన ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని భూమి పెడ్నేకర్ భావిస్తోంది. ఈ చిత్రాన్ని జి.అశోక్ తెరకెక్కించనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa