రవితేజ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ కథ 1980 నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. రవితేజ కథలను పరిగెత్తించే కథానాయకుడు. ఆయన సినిమాల్లో సందడి కోసమే అభిమానులు థియేటర్లకు వస్తుంటారు. ఇటీవల ఆయన జోష్ కి తగిన సినిమా రాలేదనేది అభిమానుల అభిప్రాయం.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రవితేజ ఈ సారి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ను ఎంచుకున్నట్టు సమాచారం. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రవితేజ అంగీకరించిన విషయం తెలిసిందే. రవితేజ బాడీ లాంగ్వేజ్ ను .. జోష్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ కథను సిద్ధం చేశాడని అంటున్నారు. 'నేను లోకల్' .. 'సినిమా చూపిస్త మావ' సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా సాగుతుందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa