ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా కరోనా వైరస్, ఐసొలేషన్, క్వారంటైన్, లాక్ డౌన్ గురించే చర్చ జరుగుతోంది. ప్రపంచం మొత్తం కరోనా గురించి వణికిపోతోంది. ఈ నేపథ్యంలో సినీ నటి, సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి మాట్లాడుతూ, అచ్చం ఇలాంటి కథతోనే 2011లో 'కాంటాజియన్' అనే సినిమా వచ్చిందని తెలిపింది. ఆ సినిమా నిండా ఇప్పుడు మనం వింటున్న పదజాలమే ఉంటుందని... వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందని పేర్కొంది. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa