ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొన్ని కారణాలతో డ్ర‌గ్స్‌ కు బానిస‌ అయ్యాను : కంగనా రనౌత్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 31, 2020, 11:08 AM

కంగనా రనౌత్.. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్‌' సినిమాలో 'సమీర'గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఆ మధ్య కంగనా ప్రధాన పాత్రలో వచ్చిన 'మణికర్ఱిక' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. అది అలా ఉంటే కంగనా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా'.. ఇటీవలే విడుదలై అనుకున్నంతగా అలరించలేక పోయింది. కాగా వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుత రోజుల్లో ఇంట్లో ఉండ‌టాన్ని బోర్‌గా ఫీల్ అవ్వొద్దు అని.. చెడ్డ రోజులే మంచి రోజులుగా మారుతాయ‌ని చెప్పింది. ఇంకా చాలా విషయాలను పంచుకుంటూ.. తాను 15 ఏళ్లు వయసులో నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చానని.. ఆ సమయంలో ఏవో కారణాలతో డ్ర‌గ్స్‌ కు బానిస‌ అయ్యానని తెలిపింది. అయితే ఆ తరువాత కొంతమంది మంచి వ్యక్తుల సాయంతో ఆ డ్రగ్స్ వాడడం ఆపేశానని తెలిపింది.ఇక తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'లో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తమిళ దర్శకుడు ఏ ఎల్‌ విజయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa