ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్నీ లియోన్‌పై నవదీప్ సంచనల వ్యాఖ్యలు.. లియోన్ ఉండాలనీ పిలుపు.

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 31, 2020, 11:12 AM

సన్నీ లియోన్.. ఓ అందాల హాట్ స్టార్. ఆమె పేరు వింటే చాలు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. అంత ఫాలోయింగ్ ఉన్నఈ భామ ఎప్పటికప్పుడు సంచలన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ భామ అటు హిందీ సినిమాల్లో నటిస్తూనే తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అదరగొట్టింది. సన్ని తెలుగు యువ హీరో నవదీప్‌తో రొమాన్స్ చేస్తోంది. హిందీ నిర్మాణ సంస్థ ఆల్ట్ బాలాజీ హిందీలో "రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్" అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇదే పేరుతో ఈ సంస్థలో గతంలో "రాగిని ఎంఎంఎస్" అంటూ ఎరాటిక్ హారర్ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అదే పేరుతో ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇందులో నవదీప్‌, సన్నీ లియోన్ కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ వెబ్ సిరీస్‌లో తెలుగు నటుడు నవదీప్ నటిస్తున్నాడు. నవదీప్ 2004లో వచ్చిన "జై" సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. ఆతర్వాత తెలుగు, తమిళ భాషలలో హీరోగా నటించిన ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్, టీవీ షోలకు వ్యాఖ్యాతగా పరిమితమైపోయాడు. అందులో భాగంగా అల్లు అర్జున్ తాజా సినిమా అల వైకుంఠపురములోలలో  ఓ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.కాగా నవదీప్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ పిక్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో సన్నీపై బోలెడంత ప్రేమ కురిపిస్తూ ఒక కవిత్వమే చెప్పాడు నవదీప్. "సన్నీ ఈజ్ ఫన్నీ... సన్నీ ఈజ్ స్మార్ట్... సన్నీ ఈజ్ హోమ్.. సన్నీ ఈజ్ సేఫ్.. బీ లైక్ సన్నీలియోన్.. ఐసోలేట్ యువర్సెల్ఫ్ అండ్ వాచ్.. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్" అంటూ కవి అయిపోయాడు. ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇంట్లోనే సన్ని లాగా ఉంటూ సురక్షితంగా ఉండాలనీ కోరాడు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం సన్నీ.. ‘కోకో కోలా’ అనే హార్రర్‌ కామెడీలో నటిస్తోంది. దాంతో పాటు ‘రంగీలా’, ‘వీరమదేవి’ అనే సౌత్ ఇండియన్ ఫిల్మ్స్‌లోను నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa