నాగచైతన్య కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'నాగేశ్వర రావ్' సినిమా రూపొందనుంది. ఈ సినిమాను 14 రీల్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతుండగా పరశురామ్ కి మహేశ్ బాబు నుంచి పిలుపురావడం, ఆయన ఆ ప్రాజెక్టు పైకి వెళ్లిపోవడం జరిగింది.ఈ నేపథ్యంలో చైతూ తమకి ఇచ్చిన డేట్స్ ను 14 రీల్స్ వారు 'దిల్' రాజుకి ఇచ్చారట. దాంతో చైతూ హీరోగా సినిమా చేయడానికి 'దిల్' రాజు రంగంలోకి దిగాడని అంటున్నారు. బీవీఎస్ రవి అందించిన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని అంటున్నారు. ఈ లోగా నటీనటులు .. సాంకేతిక నిపుణులకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తారని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa