ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్ స్టారా మజాకా పవన్ పేరు చెబితేనే ఒణికిపోతున్నారు..

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 13, 2020, 06:18 PM

అవును ఇపుడు పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే అందరు ఒణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే... సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో ముందుగా హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో నటిస్తుండంతో ఆయన అభిమానులు స్క్రీన్ పై వకీల్‌ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ పాత్ర దర్శక,నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సినిమాలో పవన్ సరసన నటించాలంటే హీరోయిన్లు ఎవరు ముందుకు రావడం లేదని టాక్.ఎందుకంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడమే అని చెబుతున్నారు. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రను ప్రేక్షకులు గుర్తించకపోవడమే కష్టమని భావించిన హీరోయిన్లు ఈ సినిమాలో నటించేందకు కొంచెం భయపడుతున్నారు. ముందుగా ఈ పాత్రలో శృతి హాసన్, అనుష్క,పూజా హెగ్డే, నయనతార వంటి స్టార్స్ పేర్లు వచ్చినా.. అవేమి నిజం కాదని తేలిపోయింది. మరి ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa