ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరణ్ తరువాత మూవీ అనిల్ రావిపూడితో...?

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 12:19 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఉగాది సందర్భంగా కీలక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమా తరువాత ఆయన 'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నాడు. ఆ తరువాత చరణ్ ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమా దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది.యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లను సమానంగా కలిపి వినోదాన్ని అందించే దర్శకుడిగా అనిల్ రావిపూడి మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3'  చేయడానికి సిద్ధమవుతున్నాడు. అలాంటి అనిల్ రావిపూడి తాజాగా చరణ్ కి కథ వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. చరణ్ 'ఆచార్య' పూర్తి చేసేలోగా, అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' పూర్తి చేస్తాడట. ఆ తరువాత ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళతారని చెబుతున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మతగా వ్యవరిస్తాడట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa