బోయపాటి శీను డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కానీ కరోనాతో వచ్చిన బ్రేక్ ను బోయపాటి స్క్రిప్ట్ కు ఉపయోగించుకుంటున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా గురించి బోయపాటి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అందుకు కారణం ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు భారీ హిట్లు రావడమే. మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని అభిమానులంతా బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. వీటిలో ఒకటి రాయలసీమకి చెందిన పాత్ర కాగా, మరొకటి అఘోర. బాలకృష్ణ అఘోర పాత్రకి డైలాగ్స్ తక్కువగా వుంటాయనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర విషయంలో బాలకృష్ణ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారట. బోయపాటి సన్నిహితులు కూడా, అఘోర పాత్రను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకంటారోననే సందేహాన్ని వ్యక్తం చేశారట. దాంతో బోయపాటి ఆ పాత్ర నిడివిని తగ్గించి, అఘోరగా బాలకృష్ణ తెరపై తక్కువ సేపు కనిపించేలా స్క్రిప్టులో మార్పులు చేసుకుంటున్నాడని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa