ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ సినిమా లో అవకాశం కోసం ఇలియానా ట్రై చేస్తున్న ఇలియానా!

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 12:52 PM

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపించింది. దాంతో తను ఈ సినిమా చేయడం లేదని ఆమె స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలోనే తెరపైకి ఇలియానా పేరు వచ్చింది. గతంలో పవన్ - ఇలియానా కాంబినేషన్లో 'జల్సా' వచ్చిన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' సినిమా కోసం ఇలియానాను ఇంకా ఖరారు చేయలేదట. తను ఈ సినిమా చేస్తానని చెప్పేసి, మేనేజర్ ద్వారా ఆమె సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇలియానాకి ఇక్కడ ఎలాంటి క్రేజ్ లేదు. ఆమె వలన సినిమాకి ఒరిగేది కూడా ఏమీలేదు. అందువలన ఈ సినిమా నిర్మాత 'దిల్' రాజు ఇంకా ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa