ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ దర్శకుడే నాని గోల్డెన్ జూబ్లీ మూవీ చేస్తాడంట ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 04:24 PM

హీరో నాని తన 50వ చిత్ర దర్శకుడిని డిసైడ్ చేసేశాడు. ఆ దర్శకుడే తన గోల్డెన్ జూబ్లీ మూవీ చేయాలని ఆశించాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు. నానిని హీరోగా వెండి తెరకు పరిచయం చేసిన దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి. దర్శకుడిగినా ఆయన 25వ చిత్రం, నాని 50వ చిత్రం ఒకటే కావాలని ఆయన కాంక్షించారు. నేడు మోహన కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని నాని ఇలా వినూత్నంగా ఆయనకు విశెష్ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికి రెండు చిత్రాలు వచ్చాయి. మొదటి చిత్రం అష్టాచెమ్మా కాగా రెండవ చిత్రం జెంటిల్ మెన్. ఈ రెండు చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. ఇక వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘వి’. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సుధీర్ కీలకమైన పోలీస్ పాత్ర చేస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa