మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారని అందరికి తెలిసిందే. అపజయమెరుగని దర్శకుడిగా కొరటాల తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ కనిపించనుండగా, ఒక ప్రత్యేకమైన పాత్రను చరణ్ పోషించనున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన రోల్ కోసం మోహన్ బాబును తీసుకోనున్నారనేది తాజా సమాచారం.ఈ సినిమాలో కామెడీ టచ్ వున్న నెగెటివ్ రోల్ ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం మోహన్ బాబును చిరంజీవి అడిగితే, కామెడీ టచ్ లేకుండా పూర్తి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అయితే చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని మోహన్ బాబు చెప్పారట. దాంతో ఆ పాత్రను అలాగే డిజైన్ చేయమని చిరంజీవి చెప్పడంతో, కొరటాల స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో వున్నాడని అంటున్నారు. పాత్ర నచ్చితే మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. గతంలో చిరూ .. మోహన్ బాబు ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa