ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమౌళి ఆయన మాట అసలు వినడట..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2020, 11:41 AM

తాజా ఇంటర్వ్యూలో కీరవాణి… రాజమౌళిలో తనకు నచ్చిన మరియు నచ్చని అంశాలు చెప్పారు. రాజమౌళిలో కీరవాణికి నచ్చని అంశం తను ఎక్కువగా చిన్న పిల్లల సినిమాలు చూస్తాడట. అవి ఎందుకు కొంచెం మెట్యూర్డ్ మూవీస్ చూడు అని కీరవాణి చెప్పినా, మళ్ళీ చిన్న పిల్లల సినిమాలే చూస్తాడట. ఇక తనలో కీరవాణికి నచ్చిన అంశం హార్డ్ వర్క్ మరియు కమిట్మెంట్ అట. తనకు కావలసినది, కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడట. పరిశ్రమలో రాజమౌళి-కీరవాణి ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. వరుసకు రాజమౌళి కి అన్నయ్య అయిన కీరవాణి ఆయనకు ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్నాడు. రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ నుండి లేటెస్ట్ ఆర్ ఆర్ ఆర్ వరకు కీరవాణి అన్ని సినిమాలకు సంగీతం అందించారు. ప్రొఫెషనల్ గా దాదాపు 20ఏళ్ల బంధం వీరిది, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa