ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు మూవీ నుంచి ప్రస్తుతానికి కాజల్ ని పక్కన పెడతారా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2020, 11:45 AM

లాక్ డౌన్  నేపథ్యంలో చిత్రాల షూటింగ్స్ మొదలైయ్యే సూచనలు కనిపించడం లేదు. మే నుండి అయినా షూటింగ్స్ మొదలవుతాయని నమ్మకంతో ఉన్న దర్శక నిర్మాతలకు పరిస్థితులను చూస్తుంటే అది జరిగేలా లేదు. దీనితో కొందరు ప్రత్యేక అనుమతులతో సెట్స్ లో ఇండోర్ షూటింగ్స్ జరుపుకోవడం బెటర్ అని భావిస్తున్నారట. అలాగే చిరంజీవి 152 వ చిత్రంగా వస్తున్న ఆచార్య టీమ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ముంబైలో ఉన్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్ లో షూట్ కి హాజరు కావడం కష్టం. ఈ నేపథ్యంలో ప్రస్తుతాని ఆమె లేని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నారట. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక కాజల్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరిపే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆచ్యార టీమ్ ప్లాన్ ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa