కీరవాణి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై వర్క్ చేస్తున్నాడు . రామ్‌గోపాల్ వర్మపై సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగీత దర్శకుడిగానే గాక, ఓ గీత రచయిత, గాయకుడు ఆయనలో ఉన్నారని, ఓ సినిమాలో కూడా నటించారంటూ ఓ ఇంటర్వ్యూలో కీరవాణిని వ్యాఖ్యాత ప్రశంసించారు.సినిమాల్లో నటించడం కొనసాగించవచ్చుగా? అంటూ ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు కీరవాణి స్పందిస్తూ, కుక్క పని కుక్క, గాడిద పని గాడిదే చేయాలని, అలాగే, మనకు సంబంధించని, చేతకాని పని మనం చేయకూడదని అన్నారు. ‘యాక్టింగ్’ అనేది ‘నా స్వధర్మం కాదు’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘కరోనా’ అంశంపై ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ కట్టడి నేపథ్యంలో ఎవరు ఏ సూచన చేసినా, ఏ కథ చెప్పినా, ఏ ఉదాహరణ చెప్పినా వాటి సారాంశం ఒక్కటేనని, ‘ఇంట్లో ఉండండి.. బయటకు వెళ్లొద్దు’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa