ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ బాబు తరువాత వంశీ పైడిపల్లి దర్శకత‍్వంలో తన సిల్వర్ జూబ్లీ సినిమాను చేయనున్నాడు. ప్రముఖ నిర్మాతలు అశ్వనిదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది.
మహేష్ బాబు నెక్ట్స్ సినిమాలో తాను హీరోయిన్‌గా నటించబోతున్నట్టుగా పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మహేష్ బాబు, వంశీ పైడిపల్లిలతో కలిసి నటించనున్నందుకు ఆనందంగా ఉంది. అందరం కలిసి ఓ అందమైన సినిమా మీకందించేందుకు ఎదురుచూస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు పూజ. పూజ హెగ్డే ట్వీట్‌పై స్పందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తనతో కలిసి వర్క్ చేయటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.
Glad to announce my next Telugu film with @urstrulyMahesh and @directorvamshi Looking forward to get together and create a beautiful film for you’ll to watch Excited
— Pooja Hegde (@hegdepooja) January 31, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa