ఫిదా సినిమాతో ఘనవిజయం సాదించిన మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న తొలిప్రేమ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
కానీ సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. ట్రైలర్ వాయిదా పడిన విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. త్వరలోనే కొత్త రిలీజ్ టైంను ప్రకటిస్తామని, మీ నిరీక్షణకు తగ్గ స్థాయిలో ట్రైలర్ ఉంటుంది అంటూ ట్వీట్ చేశాడు తమన్.
The new time of #tholiprematrailer will be announced soon !!
Delay due to technical issues
It’s worth a wait for sure !!
Thanks for the love
pic.twitter.com/0vFX8Lrzbq
— thaman S (@MusicThaman) February 1, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa