నేచరల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం `అ!`. కాజల్ అగర్వాల్, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, నిత్యామీనన్, మురళీశర్మ, ప్రియదర్శి తదితరులు నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రశాంతి త్రిపిరినేని నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ మూవీ లో కీలకపాత్రలో నటించిన రెజీనా కసండ్ర మాట్లాడుతూ – “ప్రశాంత్ కథ చెప్పగానే నేను విజువలైజ్ చేశాను. క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియడంతో.. నాకు ఈ క్యారెక్టరే కావాలని తనతో అన్నాను. ప్రశాంత్, నానిలకు స్పెషల్ థాంక్స్. నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పలేను. 16న సినిమా విడుదల కానుంది“ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa