రాహుల్ దర్శకత్వంలో నాని చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి, 'శ్యామ్ సింగ రాయ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలనీ, పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఏడాది పాటు థియేటర్స్ కి జనాలు రావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న కారణంగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa