ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యశ్ సినిమాలో హీరోయిన్ గా తమన్నా.

cinema |  Suryaa Desk  | Published : Sat, May 02, 2020, 04:02 PM

ఇప్పటికీ చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటుంది కానీ చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. తెలుగులో న‌టించిన తొలి సినిమా శ్రీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మడు ఫుల్లుగా అందాల‌నే న‌మ్ముకుని కెరీర్ లాగేస్తుంది. ఇప్పుడు భారీ ఆఫర్ ఆమె తలుపు తట్టిందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ఏకంగా 'కేజీఎఫ్' హీరో సరసన ఆమెకి అవకాశం వచ్చిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.ప్రస్తుతం యశ్ .. 'కేజీఎఫ్ 2' చేస్తున్నాడు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు. ఆ తరువాత నార్తన్ దర్శకత్వంలో యశ్ ఒక కన్నడ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. కథానాయికగా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేస్తారట


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa