అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. అయితే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రాజెక్ట్‌నల్లా ఓకే చేయడంతో వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో ఒక్కసారిగా రేసులో వెనక్కి వెళ్లిపోయింది. మధ్యలో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినా.. అదృష్టం అంతగా కలిసి రాలేదు. చాలా రోజుల వరకు ఒక్క హిట్ కూడా లేకపోవడం నిరాశ చెందింది. చివరగా అర్జున్ సురవరం సినిమాతో మళ్లీ విజయాన్ని దక్కించుకుంది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. అవేంటో ఓ సారి చూద్దాం. నటన పరంగా .. గ్లామర్ పరంగా లావణ్య త్రిపాఠికి మంచి పేరు వుంది. ఒక్కో సినిమాను ఒప్పుకుంటూ, తనని తాను నిరూపించుకుంటూ వెళుతోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ, తనపై వచ్చిన విమర్శలను గురించి ప్రస్తావించింది."మొదటి నుంచి కూడా విభిన్నమైన పాత్రలనే చేస్తూ వెళుతున్నాను. అలాగే 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాను కూడా చేశాను. ఆ సినిమా విడుదల తరువాత, నా మేకప్ బాగోలేదంటూ విమర్శలు వచ్చాయి. మరోసారి నా పాత్రను చూసుకున్న తరువాత నాకు కూడా అదే అనిపించింది. అప్పటి నుంచి మేకప్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టాను. 'అర్జున్ సురవరం'లో నా లుక్ బాగుండటానికి కారణం, నేను తీసుకున్న జాగ్రత్తలే. ప్రస్తుతం తెలుగులో 'ఎ 1 ఎక్స్ ప్రెస్' చేస్తున్నాను. తమిళంలో రెండు సినిమాలను ఒప్పుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa