ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్కేశ్వర్ మందిరం చెరువులో రిషికపూర్ అస్థికలను నిమజ్జనం

cinema |  Suryaa Desk  | Published : Mon, May 04, 2020, 04:15 PM

భారతీయ సినీ దిగ్గజం రాజ్‌‌కపూర్ ఫ్యామిలీ అంటే బాలీవుడ్‌లోని సంపన్న వర్గంలో ఒకటని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాజ్ కపూర్ తర్వాత కపూర్ వంశ వారసత్వాన్ని రణధీర్, రిషి, రాజీవ్ కపూర్లు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌పై ఆ భారాన్ని వదిలివేశారు. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రిషి కపూర్ ఏప్రిల్ 30న మరణించిన సంగతి తెలిసిందే.దివంగత బాలీవుడ్ నటుడు రిషి కపూర్ అస్థికలను ఆయన భార్య నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ముంబైలోని బన్గంగా తలాల్ (చెరువు)లో ఈరోజు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి రణబీర్ కపూర్ ప్రియురాలు, సినీనటి అలియా భట్ కూడా హాజరైంది.ఈ సందర్భంగా రిషి సోదరుడు రణధీర్ కపూర్ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు ఉండటంతో హరిద్వార్ వెళ్లేందుకు అనుమతులు లభించలేదని చెప్పారు. అందుకే ముంబైలోని బన్గంగాలో అస్థికలను కలిపామని తెలిపారు.అస్థికలను నిమజ్జనం చేసే సమయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం అన్ని పూజలను నిర్వహించారు. బన్గంగా ట్యాంక్ ముంబై మలాబార్ హిల్స్ లోని పురాతన వాల్కేశ్వర్ మందిర ప్రాంగణంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa