ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ కోసం కథ, మాటలు అందించనున్న త్రివిక్రమ్?

cinema |  Suryaa Desk  | Published : Wed, May 06, 2020, 04:18 PM

ప్రస్తుతం పవన్ తన తాజా చిత్రంగా 'వకీల్ సాబ్' చేస్తున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రాన్ని  చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు పూర్తికాగానే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు.ఈ సినిమా తరువాత 'డాలీ' దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గోపాల గోపాల' హిట్ మూవీగా నిలిచింది. డాలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్, ఆ సినిమాకి కథ .. మాటలు అందించవలసిందిగా త్రివిక్రమ్ ను కోరాడట. అందుకు త్రివిక్రమ్ అంగీకరించాడని అంటున్నారు. గతంలో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన 'తీన్ మార్' సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు అందించిన సంగతి తెలిసిందే. పవన్ సినిమాకి త్రివిక్రమ్ కథ .. మాటలను అందించనుండటం, ఈ ప్రాజెక్ట్ క్రేజ్ ను పెంచుతుందనే చెప్పచ్చు! 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa