ధడక్' సినిమాతో బాలివుడ్‌లో అరంగ్రేటం చేసింది జాన్వీకపూర్. 2018లో రిలీజ్ అయిన ధడక్ సినిమా తర్వాత ఆమె మరే సినిమాలో కనిపించలేదు. ఇక తాజాగా జాన్వీకపూర్ టాలీవుడ్ సినిమా మీద ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.దిల్‌రాజు నిర్మిస్తున్న వకీల్‌సాబ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి మరో నిర్మాత బోనీకపూర్. ఆయనతో దిల్‌రాజు చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయట. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకలో జాన్వీ టాలీవుడ్ లాంచింగ్ గురించి అధికారికంగా ప్రకటిస్తారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa