దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవా చూపిస్తోంది స్టార్ హీరోయిన్ సమంత. నాగ చైతన్య నటించిన 'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఆమె.. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎన్టీఆర్, సమంత జంట మరోసారి కలసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి., ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది. ఇందులో కథానాయికగా సమంతను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa