దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో హాట్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ భామ నభా నటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం `సోలో బ్రతుకే సో బెటరు`, `అల్లుడు అదుర్స్` వంటి సినిమాల్లో నటిస్తోంది. తాజాగా నభాకు ఓ బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
త్వరలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు `అయిననూ పోయి రావలే హస్తినకు` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం నభాను అనుకుంటున్నారట. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రలో నభా కనిపించబోతోందని సమాచారం. మరి, ఇదే నిజమైతే నభాను అదృష్టం వరించినట్టే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa