తన స్థాయికి తగ్గ మంచి ఆఫర్లు వస్తే నటించడానికి అభ్యంతరం లేదంటూ ఒకప్పటి కథానాయిక రేణు దేశాయ్ ఇటీవల చెబుతున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ఆమెకు టాలీవుడ్ నుంచి తాజాగా ఒక ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రముఖ నటుడు మహేశ్ బాబు తన జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం నుంచి ఆ ఆఫర్ వెళ్లడం ఇక్కడ విశేషం!
అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సంస్థ తాజాగా 'మేజర్' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. 26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ కీలక పాత్రకు గాను రేణు దేశాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ, చాలా పవర్ ఫుల్ పాత్ర కావడంతో ఆమె అంగీకరించే అవకాశాలు వున్నాయని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa