నడుమందాల భామ ఇలియానా ఈ మధ్య కాస్త ఎక్కువగానే వార్తల్లో నిలుస్తుంది. ఆ మధ్య బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అంటూ హాట్ హాట్‌గా వార్తల్లో నిలిచిన ఇలియానా.. కొంతకాలంగా కామ్‌గానే ఉంటుంది. ఇక ఈ లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం అయిన ఇలియానా అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రమ్‌లో ఫొటోలతో, వీడియోలతో దర్శనమిస్తూ.. తన ఫిట్‌నెస్ రహస్యాలను తెలిపే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇక త్వరలో నాగార్జున తో జతకట్టనుంది తెలుస్తుంది. ఇటీవల నితిన్ నటించబోతున్న అంధాదున్ రీమేక్ కోసం ఇలియానాను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ ఆఫర్ కు ఇలియానా నో చెప్పిందని టాక్ వినిపిస్తుంది. అంధాదున్ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించింది.ఈ పాత్రను పాత్ర వయసు తగ్గించి ఇలియానాతో చేయిస్తే బాగుంటుందని భావించారట చిత్రయూనిట్ . కాని వయసు తగ్గించినా కూడా అప్పుడే తాను అలాంటి పాత్రలు చేయను అని... అలాంటి పాత్రలకు ఇంకా సమయం ఉందంటూ ఇలియానా సున్నితంగా ఆఫర్ ను తిరష్కరించిందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa