అను అగర్వాల్.. 90లలో సినిమాలను బాగా చూసే వారికి ఈ పేరు కచ్చితంగా గుర్తుంటుంది. తిరుడ తిరుడ తెలుగులో దొంగ దొంగ, ఆషుఖీ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. చేసింది కొన్ని చిత్రాలే అయినా టాప్ దర్శకులు, గుర్తుండిపోయే పాత్రల్లో అను అగర్వాల్ నటించారు. అయితే అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం ఆమె కెరీర్‌ను దెబ్బ తీసింది. అంతేకాదు తన గతాన్ని మర్చిపోయేలా చేసింది. 1999లో అను ఓ యాక్సిడెంట్‌కు గురి కాగా 29 రోజుల పాటు కోమాలో ఉండిపోయారు. అప్పటివరకు జరిగిన గతాన్ని మర్చిపోయారు. ఆ తరువాత పలు చికిత్స ద్వారా కోలుకున్న ఆమె పవర్ లిఫ్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె 20 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అను అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇప్పటి అనుగా ఆమె నటించబోతున్నారు. ఇక ఆమెకు చెందిన యంగ్ పాత్రలో మరో యువ నటి నటించబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa