బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్..డీకే లు దోపిడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించారు. ఈ డైరెక్టర్లు హిందీలో పలు విజయవంతమైన చిత్రాలు తీసి సత్తా చాటారు. ప్రస్తుతం సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ ను లాంఛ్ చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా బీటౌన్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ దర్శక ద్వయం షాహిద్ కపూర్ తో హిందీలో వెబ్‌సిరీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ముంబై సర్కిల్స్ లో వార్త హల్ చల్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ సౌజన్యంతో ఈ వెబ్ సిరీస్ రానుందట. ఇప్పటికే షాహిద్ కపూర్ కు స్క్రిఫ్ట్ వినిపించగా..షాహిద్ కు కథ నచ్చిందట. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రానున్న ఈ సినిమాను పలువురు ప్రముఖ నటీనటులతో తెరకెక్కించేకు సిద్దమవుతున్నట్టు టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa