ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్‌గోపాల్ వర్మ 'మర్డర్‌' ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 28, 2020, 11:16 AM

కరోనా వైరస్‌.. లాక్‌డౌన్ సమయంలో వరుస సినిమాలు చేస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఈయన తెరకెక్కించిన మరో చిత్రం 'మర్డర్‌'. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఆర్జీవీ మంగళవారం విడుదల చేశారు. ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. అది సహించలేని అమ్మాయి తండ్రి అబ్బాయిని హత్య చేయించడం తర్వాత అమ్మాయి తండ్రి తీవ్రంగా మనోవేదన పడటం అనే సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు వర్మ. ఈ కేసుకు సంబంధించి అన్నీ విషయాలు తెలుగు ప్రజలకు తెలిసిందే. అయితే ఇందులో వర్మ కొత్తగా ఏం చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాపై కూడా ఎప్పటిలా వివాదాలు నెలకొన్నాయి. ఆర్జీవీ 'మర్డర్' సినిమా వల్ల కోర్టులో నడుస్తున్న కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ ప్రణయ్ తండ్రి, అమృత మామయ్య బాలాస్వామి కోర్టులో కేసు వేశారు. మరి ఈ సినిమా విడుదలకు ముందు ఎన్ని వివాదాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa