రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం వర్మ కు రూ.4వేల పెనాల్టీ విధించింది. లాక్‌డౌన్ తర్వాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ 'పవర్ స్టార్ ' సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఒక్కరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసారు. సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందున వర్మకు ఫైన్ వేయాల్సిందిగా ఈవీడీఎం విభాగానికి తెలిపాడు. అయితే ఆ ఫిర్యాదు పై స్పందించిన ఈవీడీఎం విభాగం వర్మకు రూ.4 వేల ఫైన్ విధించింది. అయితే పవర్ స్టార్ అనే సినిమా తెరకెక్కించిన వర్మ ఈ నెల 25 న దానిని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల చేసాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa