ప్రముఖ తమిళ హీరో విశాల్ తండ్రి, సీనియర్ ప్రొడ్యూసర్ జీకే రెడ్డి ఇటీవలే కరోనా బారినపడినా, కొన్నిరోజుల్లోనే ఆ మహమ్మారిని జయించారు. 82 ఏళ్ల జీకే రెడ్డి ఇప్పటికీ తనయుడు విశాల్ తో పోటీ పడేలా ఫిట్ గా ఉండడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మధ్యే ఆయన ఓ వీడియోలో తన హెల్త్ సీక్రెట్ తెలిపారు.
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున బయటికి వెళ్లే పరిస్థితి లేదని, అయితే ఇంట్లో ఉండి కూడా ఫిట్ నెస్ పెంపొందించుకోవచ్చని అన్నారు. తేలికపాటి వ్యాయామాలు కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని, క్రమం తప్పకుండా చేస్తే ఏ వయసులో అయినా ఫిట్ గా ఉండొచ్చని స్పష్టం చేశారు. జీకే రెడ్డి పోస్టు చేసిన ఫిట్ నెస్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa