మాదక ద్రవ్యాల కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ గురువారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వార్తలు ప్రసారం కాకుండా సమాచారశాఖకు ఆదేశాలివ్వాలని రకుల్ ప్రీత్‌సింగ్ పిటిషన్‌లో కోర్టును కోరింది. జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియాలో ప్రసారాలపై సుప్రీం కోర్టు స్పందించిందని పేర్కొంది. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పిందని జస్టిస్ నవీన్ చావ్లా వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఈ మేరకు సమాధానం ఇవ్వాలని సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే స్వీయ నియంత్రణ పాటించాలని హైకోర్టు మీడియా సంస్థలకు సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa