స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది. ఇక సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. తన అభిమానులను ఉద్దేశిస్తూ రష్మిక మందన్నా ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన జీవితంలోఎదురైన సమస్యలను అభిమానుల అండదండలతో దాటానని, అభిమానులే తన బలమని, ఈ లాక్డౌన్ సమయంలో వారితోనే ఎక్కువ సమయం గడిపానని చెప్పింది రష్మిక. త్వరలోనే సినిమా షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నట్లు కూడా రష్మిక చెప్పింది. ఈ ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హిట్ కొట్టిన రష్మిక, ఇప్పుడు అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తోంది. అలాగే తమిళంలో కార్తి హీరోగా చేస్తున్న 'సుల్తాన్' సినిమాలోనూ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa